Monday, February 27, 2012

కృష్ణా జిల్లా జె.వి.వి.సైన్స్ టాలెంట్ టెస్ట్,విజయవాడ 21.02.2012















జె.వి.వి.కృష్ణా జిల్లా సైన్స్ టాలెంట్ టెస్ట్ గాంధీ మునిసిపల్ హైస్కూల్‌లో 21,ఫిబ్రవరి,2012 నాడు జరిగింది. ఈ టెస్ట్‌కు మండల స్థాయిలో పెట్టిన టెస్ట్‌లో అర్హత సాధించిన 75 మంది విద్యార్ధులు హాజరయ్యారు. సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేశ్వర రావు అధ్యక్షత వహించారు. సైన్స్ టాలెంట్ టెస్ట్ ఉద్దేశం గురించి జె.వి.వి. రాష్ట్ర కార్యదర్శి జంపా కృష్ణకిషోర్ వివరించారు. ముఖ్య అతిధిగా జిల్లా ఉప విద్యాధికారి శ్రీ కె.దుర్గాప్రసాదుగారు హాజరై విద్యార్ధులలో శాస్త్రీయ దృక్పధం పెంపొందించటానికి జె.వి.వి. చేస్తున్న కృషిని కొనియాడారు. ఇది విద్యార్ధులలోని సామర్ధ్యాన్ని వెలికితీసి, మరింత ఎదుగుదలకు దోహదం చేస్తుందని చెప్పారు. సైన్స్ టాలెంట్ టెస్ట్ కోఆర్డినేటర్ శ్రీ వి.టి.ఆర్.నెహ్రూ టెస్ట్ రాయటంలో పాటించవలసిన నిబంధనలను,సూచనలను తెలియజేశారు. శ్రీ దుర్గాప్రసాదుగారు పరీక్షా పత్రాన్ని విడుదల చేశారు. జె.వి.వి.జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి పాగొలు రమేష్,జిల్లా కార్యదర్శి రాఘవరాజు, నగర ప్రధాన కార్యదర్శి కోయ వెంకటేశ్వర్లు, నగర కార్యదర్శి మరియు కంకిపాడు మండల సైన్స్ టెస్ట్ కోఆర్డినేటర్ ఆళ్ళ శ్రీనివాస రావు గార్లు వేదికనలంకరించారు. టెస్ట్ పూర్తయ్యాక 'కీ' విడుదల చేశారు. ఫలితాలు వెంటనే ప్రకటించారు. ఇంగ్లీషు,తెలుగు మీడియంల నుండి మొత్తం ఆరుగురు రాష్ట్ర స్థాయి టెస్ట్‌కు అర్హత సంపాదించారు. వీరు 29వ తేదీన గుంటూరు జిల్లా చిలుమూరులోని శ్రీ రామా రూరల్ విద్యాసంస్థలో జరిగే రాష్ట్ర స్థాయి టెస్ట్‌లో పాల్గొంటారు. 28న విద్యార్ధులకు విహార యాత్ర నిర్వహిస్తారు. ఫిబ్రవరి,29నాడు జరిగే ముగింపు సభలో గౌరవనీయ మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు, కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి, రాష్ట్ర మంత్రులు శ్రీ కొలుసు పార్ధసారధి,శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాదు, డా.శైలజానాద్‌గార్లు పాల్గొంటారు.

Thursday, February 23, 2012

చల్లపల్లి మండల్ జెవివి సైన్స్ టాలెంట్ టెస్ట్ 16-02-2012

             జె.వి.వి.సైన్స్ టాలెంట్ టెస్ట్ చల్లపల్లి మండల టెస్ట్ చల్లపల్లి విజయా పబ్లిక్ స్కూల్‌లో 16-02-2012న జరిగింది. దీనికి జె.వి.వి. రాష్ట్ర కార్యదర్శి శ్రీ జంపా కృష్ణ కిషోర్‌గారు, విజయా పబ్లిక్ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గారు శ్రీ నాగళ్ళ భీమా రావుగార్లు నిర్వహించారు. ఈ టెస్ట్‌కు చల్లపల్లి మండలం నుండి స్కూల్ స్థాయిలో అర్హులైన విద్యార్ధులు హాజరయ్యారు. 12 మంది విద్యార్ధులు టెస్ట్‌లో పాల్గొన్నారు.




జె.వి.వి.విజయవాడ నగర జోన్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ 2012

విజయవాడ నగర జోన్స్ టాలెంట్ టెస్ట్ STVR మ్యున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో 14-02-2012 నాడు మధ్యాహ్నం 3-00 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి EFTRONICS మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామకృష్ణగారు, వివేకానంద సెంటెనరీ స్కూల్ సెక్రెటరీ&కరస్పాండెంట్ శ్రీ అప్పలరాజుగారు ,ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి STVR మ్యున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ హెడ్‌మాస్టర్ శ్రీ సుబ్రమణ్యంగారు, సైన్స్ టెస్ట్ నగర కోఆర్డినేటర్ శ్రీ నెహ్రూగారు, తదితర ఉపాధ్యాయులు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జె.వి.వి.నగర ప్రధాన కార్యదర్శి కోయ వెంకటేశ్వర్లు, జె.వి.వి.కార్యదర్శి మోతుకూరు అరుణ్‌కుమార్‌గారు,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని అన్ని స్కూళ్ళ నుండి ఎంపికయిన విద్యార్ధులకు మండల స్థాయి టెస్ట్ నిర్వహించటం జరిగింది. టెస్ట్ పూర్తవగానే విద్యార్ధులకు 'కీ' ఇవ్వటం జరిగింది. ఫలితాలు ప్రకటించటం జరిగింది. వీరు 21-02-2012నాడు గాంధీ మ్యున్సిపల్ హైస్కూల్‌లో జరిగే జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో పాల్గొంటారు.






Wednesday, February 22, 2012

జెవివి సైన్స్ టాలెంట్ టెస్ట్ 2012,విజయవాడ








జనవిజ్ఞాన వేదిక,కృష్ణా జిల్లా సైన్స్ టాలెంట్ టెస్ట్ 2012 విజయవాడ నగరంలో 7-02-2012 నాడు STVR మ్యున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో నిర్వహించింది. ఆ టెస్ట్‌కు హెడ్‌మాస్టర్ శ్రీ సుబ్రమణ్యంగారు కంవీనర్‌గాను, శ్రీ నెహ్రూ గారు కోఆర్డినేటర్‌గాను వ్యవహరించారు. వేరు వేరు స్కూళ్ళలో పాఠశాల స్థాయిలో నిర్వహించారు. STVR హైస్కూల్‌లో జరిగిన టెస్ట్‌కు పాపులర్ షూమార్ట్‌కు అధినేత చుక్కపల్లి అమర్ కుమార్‌గారు, విజయవాడ మ్యున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీ కొండలరావుగారు అతిథులుగా హాజరయ్యారు. ఫలితాలు ప్రకటించారు.